Global Brahmins Help Desk., Matrimony Wing. Free Service.

పెద్దలకు మనవి , ఇక్కడ ఆడపిల్లల వివరాలు మాత్రమే అది కూడా బేసిక్ వివరాలు పోస్ట్ చేస్తాము. పేరుపై ప్రెస్ చేస్తే పూర్తి వివరాలు కనపడుతాయి. సదరు వధువు వయసు గోత్రం మీకు సరిపోతే అది కూడా మీ అబ్బాయి వయసు రెండు లేదా మూడు సంవత్సరాలు పెద్ద వాడు అయ్యి ఉంటె మీరు మీ అబ్బాయి వివరాలు మాకు వాట్సాప్ చెయ్యాలి. మీ వివరాలు అమ్మాయి తల్లి తండ్రులకు పంపుతాము. వారు ఒకే అనుకుంటే మీతో కాంటాక్ట్ చేస్తారు. మాకు ఎవరు ఫోన్ లు చెయ్యరాదు .. ఇది ఒకటికి రెండు మార్లు చదవండి, అర్థం అవుతుంది. అమ్మాయిల వివరాలు మాకు పంపండి .. మేము ఈ పేజీలో పోస్ట్ చేస్తాము. ధన్యవాదములు.

V Lakshmi Sarvani 1996 Aswini 4 Kasyapasa MBA Fin. Doing Job in Infosys

1991 March.
Bharadwajasa
Deputy Director
Irrigation Dept
Telangana State Govt.

Wanted Groom
3 Years Age GAP.
Higher Officials State or Central or
Senior Advocates High Court only.
Hyderabad Grooms only.

Sakha……videka telaganya gotram……kasyapasa. Star,……….Swati. Peru……….srilaxmi inteperu…. Chaturvedula. D.o.b ………24-02-2000. Tob………….11.55AM. Pob …………Macharla. Height………5.4″. Colour……… white. Education….. B.com computer. Job…………….infonex as AR. Current job location…. madhapur hyd. Parents details… ch.Narasimha murthy( father). Govt employee, Nagarjuna Sagar Dam irrigation department of telangana. Mother…Ch.Anuradha.house wife. Siblings…ch.gayatri graphics design. Subsect bar…videkatelaganya/velnadu. Requirment….well settle good family Hyderabad, 

Lalitha Siva jyothi MD (ans) NIMS. 6 vela niyogi Hyderabad age-24 koundinyasa. Punarvasu. Requirements -MD/MS or CA middle class family. A. A.sreenivasa Murthy

Sai Manasa 1996 Harithasa Hyderabad Persuing MS in USA 

Chi. Kamala 
12.3.1999
Hyderabad

Kutsasa Gotram
M.Sc 

Niyogulu 

Pvt Teacher

వధవులు మాత్రమే ఇక్కడ దరఖాస్తు చెయ్యండి. మీ స్వల్ప వివరాలు ఇదే పేజీలో పెడుతాము. వచ్చిన సంబంధాలు మీకు పంపుతాము. మీకు నచింతే వరుడి కుటుంబం తో మాట్లాడవచ్చు. కనుక కేవలం వధువు మాత్రమే ఇక్కడ నమోదు చేసుకోండి.

BRAHMINS MATRIMONY
Write full name with surname.

బ్రాహ్మణ వివాహ వేదిక మన వెబ్సైట్ ద్వారా నడుప బడుతుంది. కేవలం వధువు / ఆడపిల్లల వివరాలు మాత్రమే పెడుతాము. వరుడు తరపున స్పందన ఎలా ఉండాలి అనంటే : మేము పేరు , ఇయర్ ఆఫ్ బర్త్ , గోత్రం, శాఖ ఇవి మాత్రమే పెడుతాము. ఆ వయసుకు రెండు లేదా మూడు సంవత్సరాల గాప్ ఉన్న అబ్బాయిలు/ వరుడు వివరాలు మీ వద్ద ఉంటె పెట్టాలి. అప్పుడు మీ వివరాలతో వధువు తల్లి తండ్రులు తృప్తి చెందితే మీకు వాట్సాప్ లేదా కాల్ చేస్తారు తర్వాత మీ ఇష్టం వారి ఇష్టం .. ఇది రుసుము లేని ఉచిత వివాహ వేదిక : అపద్దాలు రాస్తే నాతో తిట్లు తినాల్సి వస్తుంది , జాగ్రత్త. మా భావనలు మరియు అనుభవం క్రింది ఇచ్చాము మీరు అదంతా చదవాలి ..ఇరువురు బాగుండాలని మా ఆలోచన.

హైదరాబాద్ బ్రాహ్మణ సంక్షేమ భవన్ వ్యవస్థాపకులు కళ్ళే గిరి ప్రసాద్ శర్మ గారి ద్వారా నిత్యమూ బ్రాహ్మణ కుటుంబాల వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు అందుతూ ఉంటాయి, అందులో ఉచిత అంబులెన్స్, అనాథ ప్రేత సంస్కారాలు, ఉచిత వైద్యము, కుటుంబాలకు ఆసరాగా నిలబడి వారికి సహకారం అందించడం , సరకులు, మందులు , ఆఖరికి అర్జెంట్ సమయాల్లో వారిని బ్రాహ్మణ భవన్ లో ఉంచుకుని అక్కడే వైద్యం అందించడం, ఎవరు లేనివారికి అండగా నిలబడడం కేవలం ఆడపిల్లలే ఉంటె వారికి విద్యాసహాయం అందించడం, భర్త చనిపోతే వారికి ఇంటికి సరిపడా సరకులు లేదా ఇతర ఐటెమ్స్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. నిత్యమూ అనేక మెసేజిలు వారికి వస్తుంటాయి.

ఐతే ఈ మధ్య కాలం లో వివాహం అనంతరం వధూ వరులు ఇరువురు తీవ్ర ఇబ్బందులకు లోను అవ్వడం , సంసారాలు నాశనం చేసుకోవడం, కోర్టులకు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగడం లాంటివి జరిగిన సందర్భంలో పది కేసుల వరకు అమ్మాయిలకు అయన సపోర్ట్ గా నిలబడి న్యాయం చేశారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్న అయన సేవలకు మరింత బలం చేకుర్చాలి? మన బ్రాహ్మణ సమాజం లో వివాహ ప్రక్రియ ఎలా ఉండాలి అని ఒక ప్రణాళిక సిధ్ధము చేసినారు. ఇందులో ప్రధాన అంశాలు.

exclamation mark, punctuation marks, important-1421914.jpg

1.

అమ్మా, మీ అబ్బాయి సంసారానికి పనికి రాడని మీకు తెలుసు, అబ్బాయికి కూడా తెలుసు. కనీసం ఒకటో రెండు మార్లో డాక్టర్ వద్దకు వెళ్లి నా సమస్య ఇది అని చెప్తే, అసలు పనికి వస్తాడో రాడో డాక్టర్లు చెబుతారు. కనుక వివాహానికి పనికి రాము అని తెలిసి కూడా దయచేసి పెళ్లి చేసుకుని లేదా చేసి ఆడ పిల్ల గొంతు కొయ్యకండి

2.

ఆడపిల్లలూ ,అత్యంత ఆశలకు పోయి, కేవలం ఆస్తులు , డబ్బు ఉంటేనే పెళ్లి చేసుకోవాలి అన్న అభిప్రాయం మార్చుకోండి .. సంబంధం వచ్చినప్పుడు వారు ఎలాంటి వారు ? కనీస అర్హతలు ఉన్నాయా అన్నది చూడండి .. తర్వాత అత్తమామలతో అణుకువగా ఉండి మంచి నడవడికతో సంసారాన్ని నిలబెట్టుకోవాలి , మీరు ఎక్కువ ఆశ , స్వార్థం ప్రదర్శిస్తే .. డబ్బు ఉన్న వారు చేసుకున్నా ప్రేమను పొందలేరు .. మళ్ళీ కేసులు, కోర్టులు మామూలే .. అప్పుడు మాట్లాడే ప్రతి మాట అహంకారం క్రిందకు వస్తుంది. కనుక మీరు మీ తల్లి తండ్రిని గౌరవించండి కానీ సమాజం పట్ల అవగాహనా లేకుండా సినిమాల్లో లాగ ఊహించుకుంటే జీవితం చాలా దుర్భరం అవుతుంది. జాగ్రత్త. మీకు వచ్చిన సంబంధం మాకు పంపండి , ఎంక్వైరీ చేసి మంచిదో కాదో చెప్తాము.

3.

దయచేసి వియ్యంకులు పిల్లల విషయం లో నోరు జారడం చెయ్యకండి , దానివల్ల వారి జీవితాలనే కాకుండా తమ ఆరోగ్యాలు కూడా పాడుచేసుకోవడం లాంటివి జరుగుతాయి. వయసు పెరిగి ఎదో కొంత కాలం సంతోషంగా ఉండకుండా లేని పోనీ చికాకులు తెచ్చుకుని ఎందుకు ఇబ్బంది పడడం ? మనం పెద్దరికం నిలబెట్టుకోవాలి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అప్పటికి అప్పుడు ఏదైనా అన్నా, గంటలో మళ్ళీ రీసెట్ అవ్వాలి, వారిని కోడలు ఐన , కొడుకు ఐన దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆలా చెయ్యరాదు అని చెప్పాలి. వారి తప్పు వారు తెలుసుకునేలా సున్నితంగా మందలించాలి. అప్పుడు పిల్లలు ఇద్దరు బాగుంటారు.

4.

కేవలం డబ్బు, బంగారం మాత్రమే జీవితం కాదు సుఖం సంతోషం కూడా ముఖ్యం అని చెప్పడానికి

ఇవన్నీ పట్టించుకోకుండా పెళ్లి పెళ్లి అని తీరా పెళ్లి అయ్యాక డ్రైనేజి కంటే కంపు మాటలు మాట్లాడుకుని కడుపుకు అన్నం తింటున్నారా ? ఎం తింటున్నారు అని బంధువులతో అనిపించుకోవడం ఎందుకు అని తెలియ చెప్పడానికి ..

మరియు మన సమాజ అభివృద్ధి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని వధూవరులకు ఇద్దరికీ ముందే కొన్సిలింగ్ లాగా ఈ విషయాలపై అవగాహనా తెప్పించే విధంగా మెసేజి పెట్టడం జరిగింది ఇరువైపులా ఏ కుటుంబం కూడా నష్టం, బాధ పడకూడదు అని మాత్రమే మా తాపత్రయం.

వందకు ఎనభై కేసుల్లో ఈరోజు పెళ్ళైన ఏడాది లోగా కేసులు, కోర్టులు అంటూ పరిగెత్తుతూ ఉన్నారు. కనుక మీరు ఈ సమాజం ఎలా ఉంది అని తెలుసుకోవాలి. ఆలోచించాలి., ఆచరించాలి కనుక ఈ మెసేజీని అందరికి పంపండి, మీరు కూడా ఆచరించండి పెళ్లి అనేది నూరేళ్ల పంట

చీటికీ మాటికీ పోట్లాడుకుని విడిపోయి తలనొప్పి తెచ్చుకునేందుకు కాదు ..

~ FOR BETTER SOCIETY – BRAHMINS MARRIAGE BUREAU ~

ఈ క్రింది విషయాలు మీరు చదివి , మీరు ఈ విషయాలపై అవగాహనా కల్గి ఉన్నారా లేదా అన్నది ఆలోచన చేసి. మేము పెట్టిన సంబంధాల వయసుకు సుమారు 3 లేదా 4 సంవత్సరాల తేడాతో మీ సంబంధం ఉంటె .. వివరాలు పెట్టండి. మేము సదరు వధువుల తల్లి తండ్రులతో మాట్లాడి మీకు తెలియ చేస్తాము.

ముందుగా పుట్టిన సంవత్సరం మరియు గోత్రము ఇవి రెండు మీకు ఒకే అనుకుంటే 3 లేదా 4 ఏళ్ల గ్యాప్ తో అబ్బాయి ఉంటె అయన వివరాలు క్రింది సమాచారం మేరకు అన్ని ఒకే అనుకుంటే మాకు తెలియ చెయ్యండి.

ఇది ఎవరిని కించపరచడానికి కాదు, జరుగుతన్న అన్యాయాల పై మా స్పందన మాత్రమే. ఇబ్బంది లేనపుడు ఆవేశాలు అవసరం ఉండవు.

శుభమ్ భూయాత్

గిరి ప్రసాద్ శర్మ కళ్ళే

ఇది బ్రాహ్మణ సంబంధాల సమూహం లేదా వేదిక కాదు..
కేవలం కొన్ని సంబంధాలు కలుపుదాము అన్న ఆలోచన మాత్రమే.

Read these points carefully before responding

1

వధూ వరుల పెళ్లి చూపుల్లో ఎం చెయ్యాలి

2

సంబంధం కుదిరించిన వారు ఎవరు?

3

పెద్దలా లేక ఆన్లైన్ లో చూశారా?

4

వధూవరులు ఇద్దరు నిజాలే చెప్తున్నారా ..

5

చదువులు, ఉద్యోగాలు?

6

ఆరోగ్య వివరాలు

7

ఆదాయ వివరాలు నిజమేనా ?

8

పెళ్ళికి పూర్వం ఇతరులతో ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా

9

ఇద్దరికీ సమ్మతం అయ్యాకనే పెద్దలు పెళ్లి చేస్తున్నారా ?

10

అత్తమామలతో కలసి కాపురం ఉంటారా ?

11

విడిపోవాలి అనుకుంటారా ?

12

ఉద్యోగాలు ఎక్కడ ? ఉన్నది ఎక్కడ ?

13

వియ్యంకులు పరస్పరం అన్ని మాట్లాడుకున్నారా ?

14

వియ్యంకులకు ఇతర కేసులు ఉన్నాయా ?

15

ఆస్తులు బ్యాంకు లెక్కలు ఉన్నాయని అపద్దాలు చెప్పుకుని తర్వాత ఇబ్బంది పెడుతారా ..

16

అబ్బాయి సంసారానికి పనికి వస్తాడు

17

అబ్బాయికి ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు లేవు

18

అబ్బాయికి సరి ఐన ఆదాయం ఉంది

19

అబ్బాయి భార్యను బాగా చూసుకుంటాడు

20

పెళ్లి ఐన తర్వాత విడాకులు కోరడు

21

పెళ్లి ఐన తర్వాత తల్లితో కలసి భార్యను హింస పెట్టడు

22

పెళ్లి చేసుకున్నాక సంసారం చేస్తాడు

23

పెళ్లి కి ముందు వేరే వారితో ఎలాంటి సంబంధాలు లేవు

24

కట్న కానుకల కోసం సతాయించరు

25

పెళ్లి కూతురు ఇంటి పరిస్థితి మేరకు మాత్రమే పెళ్లి చేసినా ఒప్పుకుంటాడు

*

ఇలాంటి పరిస్థితి లో ఎం చెయ్యాలి అన్నది సారాంశం ..ఎవరినో ఇబ్బంది పెట్టాలని లేదా కించపరచాలని ఈ మెసేజి కాదు వివాహం అయ్యాక ఈ మధ్య కాలం లో నిష్కారణంగా వదిలెయ్యడం, తర్వాత ఇరువురు మాట్లాడకుండా మధ్యవర్తులు ఎక్కువ కల్గించుకోవడం

26

వియ్యంకులు కలసి కూర్చుని మాట్లాడుకునే అవకాశాలు లేకపోవడం

27

కోర్టులు పోలీస్ స్టేషన్ లకు వెళ్లడం, వెళ్ళగానే పరువులు పోయాయి అనుకుని ఇక అసలే మాట్లాడకుండా పోవడం

28

పరస్పరం దూషణలు చేసుకోవడం

29

ఏళ్ళు గడచి పోయినా ఇంకా పంతాలు పట్టింపులు

30

చిన్న చిన్న వయసులోనే ఆడపిల్లల జీవితాలు ఆగం కావడం

31

సంసారానికి పనికి రాడు

32

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు

33

కట్న కానుకలు ఎక్కువ అడగడం

34

లాంటివి ముందే ఏడిస్తే విడాకులు, పోలీసులు అవసరం లేదుకదా?

*

వివాహ నమోదు ధ్రువీకరణ ప్రమాణ పత్రము

మా అమ్మాయి చి ల సౌ............ని............జిల్లా వాస్తవ్యులు శ్రీ.....మరియు, శ్రీమతి........గారి పుత్రుడు,చి..........కి ఇచ్చి వివాహము జరిగిపించుటకు సమ్మతం అయ్యాము. వివరాలు అన్ని తెలుసుకున్నాము. అబ్బాయి గుణ గణాలు అన్ని తెలుసుకున్నాము. అబ్బాయి..............వృత్తి లో ఉన్నాడు, అక్కడ వివరాలు సేకరించినాము. *బ్రాహ్మణ సాంప్రదాయ పద్దతులలో మేము వివాహము చెయ్య నిర్ణయించాము, మేము వివాహానికి గాను పెడుతున్న ఖర్చు...

బంగారం...
హాల్ పెళ్లి ఖర్చులు...
వరుడికి పెట్టిన కట్న కానుకల మొత్తం రూపాయలలో...

ఇలా ఖర్చులు మొత్తం లెక్క పెట్టి ఇరు వైపులా వారు ఒక అగ్రిమెంట్ కూడా రాసుకోవాలి. ఇరువురు సంతకాలు పెట్టుకోవాలి.

అబ్బాయి రాయాల్సిన పత్రము : నేను సంపూర్ణముగా ఆరోగ్యముగా ఉన్నాను. నాకు ఎలాంటి దీర్ఘ కాలిక జబ్బులు, రోగములు లేవు. ఉన్నాయి అంటే అవి రాయాలి, వధువు వారు సమ్మతించాలి. నేను సంసారానికి అనువుగా ఉన్నాను. నేను పెళ్లి అయ్యాక సంతోషకరమైన జీవనము గడుపుతాను. నాకు ఎవరితోనూ ప్రేమ , వివాహేతర సంబంధాలు లేవు. మధ్యము , ధూమపానం, మాంస భక్షణము అలవాటు లేదు.

గమనిక : అకేషన్ గా అని రాస్తే అది రేపు మీకు వారికి ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది కనుక మీకు అలవాట్లు ఉంటె క్లియర్ గా రాయండి, వారికి ఇష్టం ఉంటె చేసుకుంటారు లేకుంటే లేదు. చేసుకున్నాక వియ్యంకులు ఇరువురు రాసుకోవాల్సిన రెండు వాక్యాలు:

>> పిల్లలు కాక ముందే, సంపర్కము కాకా ముందే వధువును సతాయిస్తే మొత్తం రిటర్న్ ఇస్తాము నష్ట పరిహారం కింద 2 లక్షలు కూడా చెల్లిస్తాము. అలాగే సంసారం చేసి పిల్ల/లు అయ్యాక నిష్కారణంగా భార్యను / కోడలిని వదిలించుకోవాలని చుస్తే రూ 5 లక్షలు నష్టపరిహారం మరియు పెళ్లి ఖర్చు మొత్తం తిరిగి ఇవ్వగలం. కొత్తగా పెళ్లి చేసుకున్న తనపై ఎలాంటి దొంగతనాలు అంటగట్టి ఇబ్బంది పెట్టడం జరుగదు. నగలు , డబ్బు పోయాయి అని చెప్పడం లాంటివి చెయ్యము. లాంటివివి జరిగితే సరి ఐన సాక్ష్యాధారాలు చూపిన తర్వాత మాత్రమే ఏదైనా మాట్లాడుకొనుట జరుగును.

మా అబ్బాయి వృత్తి........సంపాదన.......ధృవీకరిస్తున్నాము. పిల్లలు ఇద్దరు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇబ్బంది లేదు.

ఈ క్రింది విషయాలపై మాకు అవగాహనా ఉంది:

* అమ్మాయి ని మేము తిట్టడం, హింసపెట్టడం జరిగితే అబ్బాయి హింసిస్తే ఆమె 498ఏ కేసులు వెయ్యడం.
* డివిసి కేసు వేసి కోర్టుకు వెళ్లడం. జరుగుతుంది అని తెలుసుకున్నాము
* సీనియర్ సిటిజెన్స్ అంటూ సరి ఐన సాక్ష్య ధారాలతో ఆర్దీయే వద్దకు మేము అనగా అత్తమామలు వెళ్లడం.
* కొడుకు తో సంబంధం లేదని చెబుతూ కోడలిని ఇంట్లోంచి వెళ్లగొట్టె ప్రయత్నం చెయ్యడం. లాంటివి చేస్తారు అని కూడా గ్రహించాము. ఇలాంటి పరిస్థితి మన ఇరువురు కుటుంబాల్లో వచ్చే అవకాశం లేదు అని తెలియ చేస్తున్నాము చివరిగా ఇరువురు సంతకాలు అన్ని పేపర్లపై పెట్టుకోవాలి వివాహం ఐన తర్వాత విడాకులు కావాలి అని అమ్మాయి అడిగినప్పుడు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వరు లేదా అబ్బాయి అడిగినప్పుడు ఖర్చులు ఎన్ని పెట్టారో అవి చెల్లించి , నష్ట పరిహారం చెల్లించి మ్యుచుయల్ డైవర్సి కి వెళ్తాము.

ఇంట్లోంచి పుట్టినింటికి పంపి రావద్దు అని చెబితే ఆరోజునుండి మెయింటినెన్స్ కింద రోజుకు వెయ్యి రూపాయలు అమ్మాయి అకౌంట్ కు అబ్బాయి పంపాలి.

అమ్మాయి పుట్టినింటికి వెళ్ళిపోయి రాకుండా ఇబ్బంది పెడితే ఆమెకు ఎలాంటి భరణము ఇవ్వబడదు.

ఇలా వ్రాసుకోవాలి.....

గిరి ప్రసాద్ శర్మ కళ్ళే

నాకు వాట్సాప్ మెసేజి పెట్టండి (Only Whatsapp Message)

ఈ విషయాలు చాల మందికి చదవడానికి ఇబ్బంది గా ఉన్నా యదార్థాలు .. జరిగాక అయ్యో చదివాము కానీ దీనిపై అవగాహనా రాలేదు అని అనుకుంటారు. ప్రస్తుత సమాజం లో ఇవి తప్పని సరిగా చెయ్యాలి. మీకు సహకారం కావాలి అనుకుంటే మీరు మాతో సంప్రదించండి.

చివరిగా వధూ వరులు ఇద్దరికీ విన్నపము: మీరు ఇన్నాళ్లు చిన్న పిల్లలు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన సమయం. మీలో ఏవైనా ఇబ్బందులు ఉంటె పెళ్ళికి ముందే చెప్పుకుని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోండి. మన బ్రాహ్మణ సమాజం లో ఉంటూ మద్యం, జూదం, ధూమం, మాంసాహారం తినడం సరి ఐన లక్షణాలు కాదు. మనిషి మారడానికి అవకాశం ఉంది. , ఉంటుంది. మీరు ఇద్దరు బాగుండాలని మా కోరిక. కానీ సమాజం పరిస్థితిలు మీరు అర్థం చేసుకోవాలి. తల్లి చాటున ఉండి పెళ్ళాన్ని ఇబ్బంది పెట్టడం, పెళ్ళాన్ని అసలు పట్టించుకోక పోవడం లాంటివి అమానుషాలు. కనుక మీరు బాధ్యతగా తన చెయ్యి పట్టుకుని ముందుకు వెళ్ళాలి తప్ప భార్యను అనుమానించడం , దుర్భాషలు ఆడడం , కొట్టడం చేస్తే ఈ కాలం ఆడపిల్లలు సహించరు. కనుక మీరు చాల తెలివిగా , మంచిగా ఉండి జీవితాలను సార్థకం చేసుకొమ్మని విజ్ఞప్తి. ఏదైనా ఉంటె స్వంత బాబాయ్ లాగ నాకు చెప్పండి .. నేను మీ ఇద్దరినీ పిలచి మాట్లాడుతాను. గోటితో పోయే సమస్యను గొడ్డలి దాకా తీసుకు వెళ్ళకండి.

- మీ గిరి మామ