పురోహితులు, ప్రయివేట్ అర్థక సోదరులకు విజ్ఞప్తి ఆలోచించండిమీ దరఖాస్తు వెంటనే అందించండి.  క్రింది దరఖాస్తు నింపండి చాలు, తదుపరి మా ప్రయత్నం మేము చేస్తాము 

అన్ని కులాల వారు ఎన్నికల సమయం లో లబ్ది పొందుతున్నారు, కానీ మనం అడగలేక పోతున్నాం, ఈ సారి మన పోరాటం గట్టింగా చేసి మనకు కూడా ఒక ప్యాకేజీని రాబట్టుకుందాం

Purohiths & Private Archakas Enrolment Drive
ARCHAKA OR PUROHITH ?

ప్రభుత్వం ద్వారా పురోహితులకు ప్రయివేట్ అర్చకులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం కోసం *బ్రాహ్మణ సమాజ్ పార్టీ పోరాటం మొదలు పెట్టింది* నేటి సమాజం లో మన కులవృత్తి ఐన పౌరోహిత్యాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్న లక్షలాది మంది పురోహితులలో 30% మంచి ఆదాయాలతో , ఇల్లు కట్టుకుని , మంచి ఆర్థిక పరిస్థితి లో ఉన్నా కూడా .. 70% పురోహితులు సరి ఐన ఆదాయం లేక, ప్రభుత్వ గుర్తింపు లేక ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా , ఆరోగ్యం, విద్య విషయం లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనుక పురోహితం మరియు ప్రయివేట్ అర్చకత్వం చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం వారికి హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డు, నెలసరి జీవన భృతి కల్పించడానికి మన కోసం , మన అభివృద్ధి కోసం ఏర్పాటు చెయ్యబడిన *_బ్రాహ్మణ రాజకీయ పార్టీ ద్వారా ప్రత్యేక డ్రైవ్ మొదలు పెడుతున్నాము_*

  1. ఉచిత సభ్యత్వము, తీసుకోవాల్సి ఉంటుంది
  2. నమోదు చేసుకున్న వారి వివరాలతో ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం
  3. జీవన భృతి కనీసం నెలకు రూ 20 వేలు సాధించడం
  4. హెల్త్ కార్డుల కోసం ప్రయత్నం చెయ్యడం
  5. ప్రభుత్వ డబల్ బెడ్ రూమ్ గృహాల కోసం ప్రయత్నం చెయ్యడం
  6. పురోహితులు లేదా అర్చకులు మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల నష్ట పరిహారం సాధించడం. 
  7. హాస్పిటల్ పాలైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రత్యేక మంజూరు పొందడం

లాంటి మంచి మంచి డిమాండ్ లతో ప్రభుత్వం ముందుకు ప్రత్యేక బృందం ద్వారా వెళ్లబోతోంది బ్రాహ్మణ రాజకీయ పార్టీ ఎన్నికలలో పురోహితుల మరియు ప్రయివేట్ అర్చకుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని తెలియ చెయ్యడానికి మరియు ఒక్కో పురోహితుడు మరియు అర్చకుడు కనీసం వెయ్యి మందిని ప్రభావితం చెయ్యగలడు అని నిరూపించడం కోసం, మన సత్తా చాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మనకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ని కోరడం చేసి .. ప్రతి పురోహితునికి, ప్రయివేట్ అర్చకునికి ప్రభుత్వం తరపున లబ్ది చేకూర్చడం కోసం మా ప్రయత్నం.

ప్రయివేట్ అర్చకులు, పురోహితులు మీ మీ దరఖాస్తులను మాకు పంపండి .. మొదటి 250 మంది లిస్ట్ అయ్యాక మీకు బ్రాహ్మణ రాజకీయ పార్టీ ద్వారా ప్రత్యేక సేవలను, సహాయమును ప్రకటిస్తాము. తదుపరి ప్రభుత్వానికి మీ వివరాలతో పాటు లేఖ ఇచ్చి రాబోయే ఎన్నికల నాటికి మీకు ప్యాకేజి అందచెయ్యడానికి కృషి చేస్తాము. ఇది సాధిస్తే రాబోయే కాలం లో మనకు ప్రభుత్వ ప్యాకేజి అనేది శాశ్వతం అవుతుంది.

శుభం భూయాత్

గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
వ్యవస్థాపక అధ్యక్షులు
బ్రాహ్మణ సమాజ్ పార్టీ