మేధో మధనం జరుగుతున్నది … ఎన్నైనా సూచనలు చెయ్యొచ్చు
మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు .. వాయిస్, వీడియో, రచన రూపంలో మీ ఆలోచనలు ఇక్కడ పొందుపరచండి .. దర్శనం గారు మరికొంత మంది పెద్దలు విషయాలను పరిశీలించి … తదుపరి మేధోమధనం సమయానికి ఒక ప్రణాళిక చేస్తారు. రాసేవారు విధిగా పేరు, సంఘం పేరు, తన పదవి , ఫోన్ నంబర్ రాయాలని మనవి.
గిరి
బ్రాహ్మణ సమావేశాలు సఫలీకృతం కావాలి అనుకునే వారు
1. మాట్లాడే వారు ఫోన్ లు ద్వారం లోనే డిపాజిట్ చెయ్యాలి
2. సమావేశం అజెండా కు తగ్గట్టుగా రెండు నిముషాలు మాట్లాడి, అక్కడ అందుబాటులో ఉన్న తెల్ల పేపరు పై వారి పూర్తి అభిప్రాయం రాయాలి
3. సమయానికి రావాలి .. గుళ్ళు గోపురాలు తిరిగి భోజన సమయానికి వచ్చేది ఉంటె అసలు రాకూడదు
4. నేను మాట్లాడి వెళ్ళిపోతా నేను చాలా బిజీ అనుకుంటే అసలు రాకండి , వాయిస్ లేదా లేఖ రూపం లో మీ సందేశం పంపండి
5. ఆనాటి సభ అజెండా కాకుండా యుగాలు, రాజకీయాలు, సనాతన ధర్మం, స్టాలిన్ కరెక్ట్, కేరళ లో బాగుంది, మా ముత్తాతల మీసాలు ఐదు మీటర్లు ఇలాంటి సొల్లు వెయ్యకూడదు.
6. సభా నిర్వాహకులు ఒకసారి మీ వైపు చుస్తే మీరు మాట్లాడ్డం ఆపెయ్యాలి
7. ఒకరు మాట్లాడుతుంటే వారిపై నవ్వుతు కుళ్ళు జోకులు వేస్తూ శునకానందం పొందరాదు
8. మైకు ఇస్తే గంటల తరబడి మాట్లాడాలి అనుకోరాదు
9. సభ రోజే మొత్తం ప్రపంచ యుధ్ధాన్ని ప్రకటించరాదు ..
10 . విధిగా సభా నిర్వాహకులకు కనీసం వెయ్యి రూపాయలు విరాళం ఇచ్చి వెళ్ళాలి , QR కోడ్ అక్కడ ఉంచాలి అలాగే హుండీ ఉంచాలి ..
బ్రాహ్మణ తక్షణ అవసరాలు….సమష్టిగా సాధించుకోటానికి నా సూచనలు…కార్యాచరణ అంశాలు
( మరుమాముల వేంకట రమణ శర్మ, సంపాదకులు,దర్శనమ్ మాసపత్రిక, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు)
1. 33 జిల్లాల్లో వెయ్యి గజాల నుంచి రెండు ఎకరాల వరకు స్థలం కేటాయింపు.. రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలతో బ్రాహ్మణ భవన నిర్మాణాలు.
2. ఉపనయనాలు చేయటం కోసం బ్రాహ్మణ/ ధార్మిక సంఘాలకు ఒక్కోవటువుకు 11వేల రూపాయలు , సహా కార్యక్రమ స్థాయిని బట్టి నిర్వహణకు ఆర్థిక సహకారం..
3. పురోహితులు/ అర్చకులు/వేద పండితులను వివాహమాడడానికి వచ్చే అమ్మాయిలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల డిపాజిట్ రూపంలో పారితోషికం.
4. వివేకానంద విదేశీ విద్యా పథకం మాదిరిగా భారతదేశంలో ప్రతిభతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఏదైనా కోర్సు చేసేవారికి కూడా ఆర్థిక సాయం అందించాలి.
5. ధార్మిక కార్యక్రమాలు క్రతువులు వేద శాస్త్ర జ్యోతిష్య సభల నిర్వహణకు ప్రోత్సాహకంగా ఆర్థిక సాయం అందించాలి.
6. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యం… దేవాదాయ శాఖ ధార్మిక మండలి, ఆగమ సలహా మండలి, దేవాలయాల పాలకమండలలో ఎక్కువ శాతం బ్రాహ్మణులకే ప్రాధాన్యం ఇవ్వాలి..
7. గ్రామ పురోహితులకు అర్చకులకు వేద పండితులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో ఇతర సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వాలి…
8. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారానే కేజీ టు పీజీ సంప్రదాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి… గోపనపల్లి బ్రాహ్మణ సదనంతో సహా ప్రధాన నగరాల్లో ఈ విశ్వవిద్యాలయం అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలి…
9. వేద పాఠశాలలన్నింటికీ ఒకే సిలబస్ పరీక్ష విధానం ఏర్పాటుచేసి ప్రభుత్వపరంగా ఉత్తీర్ణత పొందే వారికి పట్టాలు ప్రదానం చేయాలి.
10. దేవాదాయ శాఖ అన్ని దేవాలయాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేద పండితులు అర్చకులు ఆగమ,స్మార్త, శాస్త్ర పండితులతో నియామకాలు జరపాలి..
11. బ్రాహ్మణుడు తన వృత్తి/ జీవనం లోక క్షేమం కోసమే కనుక .. ఎవరు ఏ రూపంలో నైనా హేళన చేసిన దాడులు చేసిన నిందించినా చట్ట ప్రకారం నిందితులను శిక్షించేలా బ్రాహ్మణ హక్కుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలి…
12. దేవాదాయ శాఖలో అమలవుతున్న ఆరోగ్య పథకం పరిధిలోకి అర్చకులను, వేద పండితులను, పురోహితులను చేర్చి వీరికి ఆరోగ్య భద్రత కల్పించాలి..
13. సర్వశ్రేయోనిధి, అర్చక సంక్షేమ నిధి నుంచి అన్ని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, పురోహితులు వేదపండితులు ఎవరయినా అనారోగ్యం పాలయితే అత్యవసర వైద్యసాయం అందేలా చర్యలు తీసుకోవాలి ..
నాకు తోచిన సూచనలు ఇవి…ఇంకా ఎవరయినా మరిన్ని ఉపయుక్త సూచనలు చేస్తే వాటిని జోడించి ప్రభుత్వానికి సమర్పిద్దాం…అన్ని సంఘాలు..ముఖ్యులతో కలిసి విజ్ఞాపన పత్రం తయారు చేద్దాం
-మరుమాముల వేంకట రమణ శర్మ, సంపాదకులు,దర్శనమ్ మాసపత్రిక, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు
9441015469
Point no.3/ chala chala avasaramu. Apastamba garhya sutralu(Mari ye kalpa sutralaina) acharinchanide brahmanyam ekkadidi?
Purohitudo, archakudo, veda panditulu, gruhastalainappude, vedam nilabadutundi, tatdvara samajam nilabadutundi.
ఇందులో విద్య,వైద్యం,ఆరోగ్యం,సంక్షేమం, అన్నీ ఉన్నాయి.ఉద్యోగాల రిజర్వేషన్ అంశాని కి కూడా పరిష్కారం చూస్తే అన్నీ సమకూరినట్లే.దర్శనంగారు దాదాపు అన్ని అంశాలను పెర్కొనడం జరిగింది.వారు మేధస్సు ను బాగానే మధించారు.వారి ఆలోచనకు అభినందనలు.ఇవి నెరవేరడానికి గన్షాట్ మార్గం ఏది?సాధించుకునే మార్గం ఆలోచించండి.👌👌👍👍
గతంలో పరిషత్ నుండి,పురోహితులను వివాహమాడిన వణితలకు 2డో,3డొ లక్షలడిపాజిట్ అంశం,ఉపనయనాలకు వటువుకు ,11000, శ్రీ కె.వి.రామణాచారిగారు చేర్చారు.కానీ కొందరి ప్రబుద్దుల వల్ల తొలగి0చారు.
నేను కూడా కొన్నిఅంశాలు వ్రాసుకుని ఇందులో పెట్టాలనుకున్నాను.కానీ “చెప్పడంసులభం-చేయడంకష్టం”అనే విషయం గుర్తుకొచ్చి ఉ రుకున్నాను.సాధ్యాసాధ్యాలపై ఆలోచించే మేధో మధనం కావాలి.
పరిషత్ వారు గతంలో ఒకేసారి నాకు సంగారెడ్డి జిల్లా-రమణగారికి బహుశా సిద్దిపేట,మెదక్ జిల్లాలలో లభ్దిదారులు ఏవిధంగా వినియోగం చేసుకుంటున్నారో పరిశీలి0చి రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. మేము 3రోజుల తీరిగి వారిచ్చిన లీస్ట్ ప్రకారం వెళ్ళాము.పరిశీలించి రిపోర్ట్ ఇచ్చాము. పరిస్థితి అంతగా ఆశాజనక0గా లేదు. కానీ ప్రభుత్వ ఏ కార్పొరేషన్ లలో కూడా లబ్ధిదారుల పరిస్తితులు ఇవే.చర్యలకు ఆకాకాశంలేదు.ఉపయోగించే వారు కార్లకు,వ్యాపారసంస్థలకు “బ్రా.సం. పరేషత్ సహకారంతో”అనిబోర్డు పెట్టమన్నా ఒక్కరు కూడా పెట్టలేదు.మనవారి కృతజ్ఞతా భావానికి నిదర్శనం.
============
విప్రభవనప్రారంభించడానికి శ్రీరమణా చారిగారితో ఆహ్వానపత్రికఇవ్వడానికి శ్రీసీయం గారివద్దకు మెంబర్లము అందరం వెళ్ళినప్పుడు నేను వారితో ఓకేవిషయం చెప్పాను”అన్నీజిల్లాలలో బ్రాహ్మణ భవనాలు నిర్మిస్తే బాగుడునని”అంటే శ్రీ కేసీఆర్ గారు”తప్పాకుండా మెల్లమెల్లగా చేద్దాం”అనిఅన్నారు.రమణగారున్నారు.
అపర కర్మల భవనాలను కర్మకాండలు నిర్వ హించే ఆ ప్రాంత బ్రాహ్మణులకు అప్ప చేప్పాలి .
ధన్యవాదాలు గిరి అన్న ఇంతకు ముందు సభల వల్ల ఏమి ఒరిగిందో తెలువది కాని నేను ప్రారంబించిన మేధోమథనం అందరు చర్చలు చేసుకోవడం యువ మేధోమథనం అని ఒకరు గ్రూపు ప్రారంబించి వాళ్ళు చర్చచేయడం రేపు వరంగల్ లో విలేకర్లు మేధోమథనం చేసుకుంటున్నరు నేను అందుకే చెప్పిన ఇది ట్రయల్ రన్ మీరందరు ముందుకు తీసుకెళ్ళండి అని అన్నాను దీనిని అన్నో సంఘాలు చర్చించంకుని ముందుకు పోతున్నరు చాలా సంతోషం 🙏🙏🙏
సంక్షేమ పరిషత్ ను విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది లబ్ధి పొందినారు.. కానీ ఇంకా విమర్శిస్తూనే ఉంటారు వారి జీవితమంతా.. ఇది చాలా బాధాకరమైన విషయం… పైన పెద్దలు గోపాల శర్మ గారు చెప్పినట్టు లబ్ధి పొందిన వారు ఎప్పుడూ నాకు వచ్చింది అని బయట ఎవరూ చెప్పుకోరు.. వారు చెప్పినట్టు విదేశీ విద్యా పథకం తీసుకున్న వారు మాత్రo… నాకు తెలిసి వారికి మన బ్రాహ్మణ సమాజం గురించి కూడా తెలియదు చాలామంది కి.. ఇలా ఒక సంక్షేమ పరిషత్ ఉంది అన్న విషయం కూడా ఇది చాలా బాధాకరమైన విషయం… నేను సుమారుగా ఒక 40 నుండి 50 మందికి చెప్పాను కూడా ఇలా మన సమాజం ఉంటుంది ఒకటి .. దాన్ని గుర్తు చేసుకోండి మీరు అక్కడికి వెళ్లి వచ్చాక కూడా పేద బ్రాహ్మణులకు ఎవరైనా ఉంటే సహాయం చేయండి అని కూడా చెప్పడం జరిగింది… పైన పెట్టిన మెసేజ్ కు బాధతో😩😩😩
కొద్ది కొద్ది మందితో సకుటుంబ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించటం వలన భవిష్యత్ తరానికి కొంత బాట చూపొచ్చు. అలాగే పరిషత్ లబ్ధిదారుల లిస్ట్ ఏ జిల్లాకు ఆ జిల్లాగా బ్రాహ్మణ ప్రముఖులకు జిల్లా కలెక్టర్ లకు ఇచ్చి ఏరియా వైడ్ గా పిలిపించి ab6 లో చూపించి అందరికీ తెలిసేలా చేయొచ్చు.బ్రాహ్మణ సంఘాల నుండి బ్రాహ్మణ వదాన్యుల నుండి ఆర్థిక ఇబ్బందులున్నవారు సహకారం తీసుకుంటున్నారే కానీ,మళ్లీ ఆ సంఘాల వారికో పెద్గ మనస్సుతో ఆర్థికంగా సహకారం అందించిన వారికో ఏదయినా అవసరం వస్తే తిరిగి సహకారం అందించటంలేదు. ఉచితంగా కాదు. రీజనబుల్ ప్రైస్ తీసుకుని చేయమన్నా మన వారినే పెట్టుకుందాం వారికే వుపయోగపడదాం అనుకున్నా కూడా. వారికి మళ్లీ మన బ్రాహ్మణుల ఇళ్లలో పని చేయాలంటే నామోషీ. తక్కువ చేసి మాట్లాడినా తక్కువ డబ్బిచ్చినా వేరే వాళ్ల ఇళ్లలో పనులు చేస్తారు. ఉదా. ఇంట్లో పిల్లలనో పెద్దవాళ్లనో తూసుకోవటం. వంట చేయటం. డ్రైవింగ్ తదితరాలు. కాబట్టి సహకారం తీసుకునే వారు తిరిగి ఇలాటి సహకారం అందించేలా కూడా మన సంఘాల వారు కృషి చేస్తే బాగుంటుందని మనవి.
దేశాయ్ గారు…మీరు చెప్పినది 100% వాస్తవం…. కానీ నిఖ్ఖచ్చిగా వుండే వారికి మనవాళ్ళే ఇచ్చే బిరుదులు ఈ విధంగా ఉంటాయి. కొన్ని చోట్ల డాష్ అని వాడాను. మీరు అర్థం చేసుకోండి. వాడికి……… ఎక్కువ. వానికి మాట్లాడటం రాదు…..వానికి……పు. వాడు ఒక పనికి రానొడు….వాడు waste గాడు….వాడొక మెంటల్ గాడు…..ఇంకా అలా వున్నొడిని ఎదో అంటరాని వాడిగా చూడటం…..హేళన చేయడం…..ఒక పనికిరాని వాడిగా చిత్రీకరించడం….. కనపడ్డ వానికల్లా చెప్పడం….పని లేకపోయినా పని కట్టుకుని డప్పు కొట్టడం…..ఇలా వుంటాయి సర్….ఇక్కడున్న పెద్దలకు ఇది తెలియంది కాదు….అలా ఎందుకు ఖచ్చితంగా వున్నారు నిర్వాహకులు అని అందరూ అర్థం చేసుకున్న నాడు అన్ని సభలు, సదస్సులు అనుకున్నట్టుగానే జరుగుతాయి….మన జాతి మనుగడకు దోహద పడతాయి….లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే…..🙏🙏🙏
ఏ విమర్శ అయినా సద్విమర్శ అయి అర్థవంతంగా వుండాలి…అప్పుడు దాన్ని ఎవరయినా స్వాగతిస్తారు…అలా కాకుండా మాకు నెత్తి మీద తెల్ల వెంట్రుకలు వచ్చాయి…..లేకపోతే 20 years industry ఇక్కడ….మాకంతా తెలుసు…. మీకేమి తెలుసు….మేము చెప్పిందే వేదం అని తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే జాతి రత్నాలకు మనం ఏం చెప్పగలం….
ఏది ఏమైనా…..మన జాతి మనుగడ ప్రశ్నార్ధకం అవుతున్న తరుణంలో……జాతి మనుగడ కోసం అందరం కలిసి పోరాడి మన భావి తరాలకు ఒక మంచి భవిష్యత్తును ఇద్దామనే కోరికతో ఈ చర్చను నేను ముగిస్తూ….ఇక గణపతి మండప పూజలకు సమయం ఆసన్నమైంది కనుక సిద్ధం అయి వెళ్ళాలి……సెలవు.🙏🙏🙏
మొత్కురి రాము చేసిన ప్రయత్నం చాలా గొప్పది. అతిరథమహారధులను ఆహ్వానించి వారి అభిప్రాయము సేకరించగలిగారు.
ఇది తొలిప్రయత్నం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిగితే… సోదరులు గిరిప్రసాద్ శర్మ గారు తెలిపిన సూచనల క్రమంగా సదస్సులు జరిగేఅవకాశం ఉంటుందని భావిస్తాను.
సదస్సు నిర్వహించిన రాము చాలావరకు సఫలీకృతులు అయినట్లే భావించాలి. రాము కు శుభాభినందనలు.🙏🏻
గౌరవనీయులైన పెద్దలు అందించిన అంశాల ఎజెండాతో పూర్తిగా ఏకీభవిస్తూనే, 33 జిల్లాలను కవర్ చేసే 7 పరిపాలనా మండలాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO బ్రాహ్మణుల కోసం ఉద్దేశించిన పైన పేర్కొన్న అన్ని ఎజెండాకు వర్తించాలి. శుభం భూయాత్. 🌹🙏🌹
Badangpet BSS.
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో .. ఒక ఆరు సంఘాలు కలిసి ఐక్యవేదికలాగా ఏర్పడి, అందరం కలిసి మేడంను పదేపదే సంప్రదించడంతో,మాకు ఇచ్చిన మాట ప్రకారం మా స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు సుమారు 1600 గజాలు కేటాయించడం జరిగింది, రెండు నెలల క్రితం శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది, ఈ వారంలో పని కూడా అక్కడ స్టార్ట్ కాబోతుంది అని చెప్పడానికి సంతోషపడుతున్నాం.. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో మేడం గారు రంగారెడ్డి జిల్లాలోని అందరూ దీన్ని వినియోగించుకోవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది దానిని అందరూ వినియోగించుకునే విధంగా మా అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్లాన్ చేస్తున్నాం….త్వరలోనే పెద్దలకు తెలియజేస్తాం🙏🙏🙏